Reliance AGM 2024: జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీ, కీలక ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ, తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులు అందిస్తామని వెల్లడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani ) రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్ అమలులోకి వస్తుంది.
క్లౌడ్ డేటా స్టోరేజ్‌తో పాటు ఏఐ సర్వీసులు ప్రతి ఒక్కరికి ఇండియాలో అందుబాటులో ఉంటాయి. క్లౌడ్ స్టోరేజ్ ద్వారా యూజర్ల తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, డిజిటల్ కాంటెంట్, డేటాను సురక్షితంగా భద్రపరుచుకునే అవకాశం ఉంటుందని ముకేశ్ తెలిపారు. ఏఐకి అనుగుణంగా రిలయన్స్ టెలికాం జియో.. జియో బ్రెయిన్ కింద కొత్తరకమైన టూల్స్, ఫ్లాట్‌ఫామ్‌లను డెవలప్ చేస్తున్నది. 5జీ డార్క్ నుంచి 5జీ బ్రైట్‌కు ఇండియాను జియో మార్చేసినట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలోనే 13 కోట్ల మంది కస్టమర్లు జియో ట్రూ 5జీని తీసుకున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ వివాదం వెంటాడినా తగ్గేదేలే, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ, రెండో స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ
ఈ సందర్భంగా దాదాపు 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించిన అంబానీ.. "డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకువస్తున్నాం. వెల్‌కం ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించాలని నిర్ణయించాం. ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకునే వారికి సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుంది.
ఏఐ అనేది కొందరికి మాత్రమే అందే లగ్జరీగా మిగిలిపోకూడదని మేం భావిస్తున్నాం. ఏఐ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలనేదే మా ఉద్దేశం. కృత్రిమ మేధను అందిపుచ్చుకుని జియో వినియోగదారుల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్ జియో బ్రెయిన్ మరింత విస్తరిస్తున్నాం. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తాం" అని ముకేశ్ అంబానీ చెప్పుకొచ్చారు.
(The above story first appeared on LatestLY on Aug 29, 2024 05:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

