Verdict on Bribery: రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి విముక్తి కల్పించిన హైకోర్టు.. ఏంటా సంగతి??
వంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Pune, Oct 6: వంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ (Red Handed) గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని (Govt. Doctor) హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2007లో రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
( So how much is the Permissible limit for bribes))??
Rs 100 'too small' bribe amount, says Bombay HC; upholds govt official's acquittal
Read more at: https://t.co/ASWu9OCK1Ahttps://t.co/ASWu9OCK1A
— Dk...,☔🌂 (@DEBKANCHAN) October 6, 2023
అసలేం జరిగిందంటే??
పూణెలోని పౌడ్ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్ షిండే అనే వైద్యుడు ఉన్నారు. 2007లో స్థానికంగా ఉండే ఓ వ్యక్తిపై దాడి జరిగింది. అతడికి గాయాలయ్యాయి. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అతడు షిండేను ఆశ్రయించాడు. ఈ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అతడిని రూ.100 డిమాండ్ చేసిన అనిల్ షిండే డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఈ కేసులో స్పెషల్ కోర్టు షిండేను నిర్దోషిగా ప్రకటిస్తూ 2012లో తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టు తాజాగా సమర్థించింది.
(The above story first appeared on LatestLY on Oct 06, 2023 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

