Devon Conway-Rachin Ravindra (Photo-X)

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది.

త‌ద్వారా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్స‌ర్లు), రచిన్ రవీంద్ర (123 నాటౌట్; 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. కాన్వే, రవీంద్ర కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శామ్ కరణ్ ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర‌లో జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (43; 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జానీ బెయిర్ స్టో (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. డేవిడ్ మ‌ల‌న్ (14), మొయిన్ అలీ (11), లివింగ్ స్టోక్ (20) లు విఫ‌లం అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ మూడు వికెట్లు తీయ‌గా మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ లు చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్డ్‌, రచిన్ రవీంద్ర లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

వరల్డ్‌కప్‌ 2023లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్, జట్టులో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేసి కొత్త చరిత్ర, 4658 వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి

283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన కివీస్ రెండో ఓవ‌ర్‌లోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆట‌గాడు విల్ యంగ్‌ను సామ్ కర్రాన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో 10 ప‌రుగుల వ‌ద్ద కివీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది. ఇక ఆ త‌రువాత ఇంగ్లాండ్‌కు సంతోషించ‌డానికి ఏమీ లేకుండా పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన 22 ఏళ్ల ర‌చిన్ ర‌వీంద్ర ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు

ఈ క్ర‌మంలో 36 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. క్ర‌మంగా జోరు పెంచిన కాన్వే సైతం 36 బంతుల్లో హాఫ్ శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఏ మాత్రం లెక్క‌చేయ‌లేదు. అర్థ‌శ‌త‌కాల త‌రువాత మ‌రింత వేగం పెంచారు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. టీ20 త‌ర‌హాలోనే బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో కాన్వే 83 బంతుల్లో, ర‌చిన్ ర‌వీంద్ర 82 బంతుల్లో సెంచ‌రీలు బాదారు. సెంచ‌రీ త‌రువాత కాన్వే మ‌రింత వేగంగా ఆడాడు. 119 బంతుల్లో 150 ప‌రుగులను పూర్తి చేసుకున్నాడు. వీరు ఇద్ద‌రే మ్యాచ్‌ను గెలిపించారు.