Samyuktha Menon: పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ధనుష్ పై తన అభిప్రాయాలను చెప్పేసిన నటి సంయుక్తా మేనన్.. అభిమానులతో చిట్ చాట్
పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ధనుష్ వ్యక్తిత్వం, పని విధానంపై తన అభిప్రాయాలను చెప్పేసిన నటి సంయుక్తా మేనన్.. బింబిసారా రిలీజ్ నేపథ్యంలో అభిమానులతో చిట్ చాట్
Hyderabad, August 4: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Pawan Kalyan) పవర్ ప్యాక్డ్ మూవీ ‘భీమ్లానాయక్’ (BheemlaNayak)తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మేనన్ (Samyuktha Menon) తాగా చిత్రం బింబిసారా విడుదలకు సిద్దమైంది. ఈ క్రమంలో అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటించిన ఆమె హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సీతారామం ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ సందడి.. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన బాహుబలి.. ఎందుకు?
అభిమానులు ప్రముఖంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Mahesh Babu), ధనుష్ (Dhanush) గురించి సంయుక్త అభిప్రాయం అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. పవన్ ఒక అద్భుతమని, ఆయన గురించి ఒక్కమాటలో చెప్పడం కష్టమన్నారు. మహేష్ ఎప్పటికీ ప్రకాశించే రాక్ స్టార్ (Rock Star) అన్న ఈ అమ్మడు.. ధనుష్ మంచి వ్యక్తిత్వం గల మనిషి అంటూ పొగడ్తలు గుప్పించారు.
(The above story first appeared on LatestLY on Aug 04, 2022 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

