Sita ramam: సీతారామం ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ సందడి.. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన బాహుబలి.. ఎందుకు?
Prabhas (Image Credits: Twitter)

Hyderabad, August 4: ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'(Sitaramam). హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వినీదత్‌ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

మళ్ళీ వాయిదా పడ్డ కార్తికేయ 2.. ఆగస్టు 13న విడుదల.. సినిమా వెనక్కి వెళ్లడంపై బాధపడ్డ నిఖిల్

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..  ''సీతారామం' లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్లే దేవాలయాలు' అని ప్రభాస్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మాట్లాడిన మాటలు వైరల్ (Viral) గా మారాయి.