Uttar Pradesh Horror: యూపీలో దారుణం, సెక్స్ కోసం అబ్బాయిని అమ్మాయిగా మార్చిన వైద్యులు, వెనక ఉండి కథ నడిపించిన అతని స్నేహితుడు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో ముజాహిద్ అనే 20 ఏళ్ల యువకుడిని మత్తు మందు ఇచ్చి మహిళగా మార్చేశారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ముజఫర్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, సెక్స్ కోసం అబ్బాయిని అమ్మాయిగా మార్చిన వైద్యులు, వెనక ఉండి కథ నడిపించిన అతని స్నేహితుడు
Operation (Credits: X)

Muzaffarnagar, June 20: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో ముజాహిద్ అనే 20 ఏళ్ల యువకుడిని మత్తు మందు ఇచ్చి మహిళగా మార్చేశారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ముజఫర్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో మెడికల్‌ చెకప్‌ చేయిస్తానంటూ ఓంప్రకాశ్‌ జూన్‌ 3న మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి వ్యక్తిగత అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యులతో కలిసి ప్రకాశ్‌ నాటకమాడి ఈ తతంగమంతా నడిపినట్లు తెలిసింది. ఈ దారుణంపై బాధితుడు మాట్లాడుతూ.. ఆసుపత్రికి తీసుకొచ్చిన మరుసటి రోజు నాకు ఆపరేషన్‌ చేశారు.  నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ

స్పృహలోకి రాగానే నేను అమ్మాయిగా మారిపోయానని చెప్పారు. అప్పుడు ఓంప్రకాశ్ అక్కడికి వచ్చి తానే ఇదంతా చేయించానని అన్నాడు. ఇక నీవు జీవితాంతం నా తోనే ఉండొచ్చని చెప్పాడు. పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా చేశానన్నాడు. ఇందుకు అంగీకరించకపోతే నా తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. మా భూమిని కూడా లాక్కొన్నాడు’’ అని బాధిత యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు.ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో బాధితుడి తండ్రి జూన్‌ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఓంప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ సభ్యులు దీనిపై ఆందోళన చేపట్టారు. నిందితుడితో పాటు సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో బాధిత యువకుడిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం పడిందని, ఇందుకుగానూ అతడికి రూ.2కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

(The above story first appeared on LatestLY on Jun 20, 2024 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).