Tractor Going Out Of Control: ఫార్ములా వన్ ను మించేలా పంజాబ్ లో ట్రాక్టర్ రేస్.. అదుపుతప్పి ఒక్కసారిగా జనం మీదకు దూసుకొచ్చిన ట్రాక్టర్.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో..)

ఫార్ములా వన్ రేస్ చూశారా? చిన్నచిన్న కార్లు మెరుపు వేగంతో దూసుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాం కదూ. పంజాబ్‌ లోని కపుర్తలా జిల్లాలో ఇలాంటి తరహా గేమ్ ఒకటి ఇటీవల జరిగింది.

Tractor Going Out Of Control: ఫార్ములా వన్ ను మించేలా పంజాబ్ లో ట్రాక్టర్ రేస్.. అదుపుతప్పి ఒక్కసారిగా జనం మీదకు దూసుకొచ్చిన ట్రాక్టర్.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో..)
Tractor Going Out Of Control (Credits: X)

Newdelhi, June 17: ఫార్ములా వన్ (Formula One Race) రేస్ చూశారా? చిన్నచిన్న కార్లు (Cars) మెరుపు వేగంతో దూసుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాం కదూ. పంజాబ్‌ (Punjab) లోని కపుర్తలా జిల్లాలో ఇలాంటి తరహా గేమ్ ఒకటి ఇటీవల జరిగింది. అయితే, రేసులో కార్లకు బదులుగా ట్రాక్టర్లను వాడారు. నిబంధనలకు విరుద్ధంగా దీన్ని ఇల్లీగల్ గా నిర్వహించారు. ఐతేనేమీ.. వందలాది మంది ఈ రేసును చూడటానికి వచ్చారు. పోటీ ప్రారంభమైంది. ట్రాక్టర్లన్నీ మెరుపు వేగంతో దూసుకుపోతున్నాయి.

పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

రేసులో ఘోరం

ఇంతలో ఓ ట్రాక్టర్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పక్కనే నిలబడి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

(The above story first appeared on LatestLY on Jun 17, 2024 10:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).