Taapsee Pannu: కాఫీ విత్ కరణ్ షోపై నటి తాప్సీ సంచలన కామెంట్లు.. ఆ స్పైసీ విషయాలు తన దగ్గర లేవు కాబట్టే, షోకి పిలవట్లేదని బోల్డ్ కామెంట్స్.. ఇంతకీ అమ్మడు అలా ఎందుకు స్పందించిందంటే?
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ తడుముకోకుండా చెప్పిన తాప్సీ
Mumbai, August 8: బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ విత్ కరణ్ (Taapsee Pannu) సీజన్-7పై నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) సంచలన కామెంట్లు చేశారు. కొత్త మూవీ ప్రమోషన్లలో భాగంగా అందరు నటీనటులు ఆ షోకి వెళ్తున్నారని, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదని మీడియా నుంచి తాప్సీకి ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని ఆమెను విలేకర్లు ప్రశ్నించారు. దీనిపై తాప్సీ బోల్డ్ గా స్పందించారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం (Romantic life) లేదు అంటూ తడుముకోకుండా చెప్పారు.
ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా (Dobaaraa) ఆగస్టు 19న విడుదల కానుంది.
(The above story first appeared on LatestLY on Aug 08, 2022 12:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

