
Channai, August 8: అమీర్‌ఖాన్ (Aamir Khan) కథానాయకుడిగా నటించి, సొంతంగా నిర్మించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). కరీనాకపూర్ (Kareena kapoor) నాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ యువనటుడు నాగచైతన్య (Naga chaitanya) ప్రత్యేక పాత్రలో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు.
అరెరె.. మామంచి సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. ఎందుకంటే?
ఈ సందర్భంగా నటుడు నాగచైతన్య మాట్లాడుతూ.. తాను చెన్నై కుర్రాడినేనని, 18 ఏళ్లు ఇక్కడే పెరిగానని అన్నారు. లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన అమీర్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ (Shooting) సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమీర్ ఓ మంచి వ్యక్తి అంటూ పొగడ్తల (Praises) వర్షం కురిపించారు.