Brazil identical twins, Mayla (R) and Sofia, decided to undergo sex reassignment surgery together. (Image: AFP)

ఆగ్నేయ బ్రెజిల్‌లోని ఒక చిన్న పట్టణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా కవలలు ఇద్దరూ లింగ మార్పిడి (Brazil Trans Twins) చేయించుకున్నారు. అబ్బాయిలుగా ఉండటం ఇష్టం లేదని అందుకే అమ్మాయిలుగా మారామని చెబుతున్నారు. దీనికి వారి తాత సాయం చేయడం.. అమ్మ ప్రోత్సహించడంతో పని ఈజీగా అయిపోయింది.

ఈ ఘటన వివరాల్లోకెళితే.. బ్రెజిల్ లోని మైనాస్ జెరాయిస్ అనే రాష్ట్రంలో ఉన్న తపీరాలో ఇద్దరు కవలలు ఉన్నారు. వారి పేర్లు మేలా మరియు సోఫియా.. ఒకేలాంటి కవలలుగా ఎదిగిన, మేలా మరియు సోఫియా ఎల్లప్పుడూ కలిసి ప్రతిదీ చేసారు, మరియు లింగ నిర్ధారణ శస్త్రచికిత్స (Twins Undergo Gender Confirmation Surgery) చేయాలనే వారి నిర్ణయం కూడా కలిసే తీసుకున్నారు. వెంటనే వారు ఆగ్నేయ నగరమైన బ్లూమెనౌలోని క్లినిక్ అయిన ట్రాన్స్‌జెండర్ సెంటర్ బ్రెజిల్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ వారిద్దరికీ దాదాపు 5 గంటల పాటు శస్ర్త చికిత్స చసి వారిద్దరినీ అమ్మాయిలుగా మార్చివేశారు.

ముద్దుపెట్టి నాలుకను కొరికేసిన అమ్మడు, పడిన నాలుకను ఎత్తుకెళ్లిన సిగుల్ పక్షి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, బ్రిటన్‌లో ఆశ్చర్యకర ఘటన

మేలా అర్జెంటీనాలో డాక్టర్ చదువుతుంటే.. సోఫియా సావో పాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ మధ్యే బ్లూమినాలోని ట్రాన్స్ జెండర్ సెంటర్ బ్రెజిల్ అనే ఆస్పత్రిలో వారు ఆపరేషన్ చేయించుకుని ఆడవారిగా మారారు. అయితే, ఇప్పటిదాకా కవల పిల్లలు ఇలా ఒకేసారి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడం ఎక్కడా చూడలేదని, ఇదే మొదటిసారి అని వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ తెలిపారు. కాగా, ఆపరేషన్ కు 20 వేల డాలర్లు ఖర్చు కాగా.. వారి తాత ఆ మొత్తం చెల్లించాడు. ఆడవాళ్లలా మారిన తన బిడ్డలను చూసుకుని మారా లూసియా డ సిల్వ ఆనందం వ్యక్తం చేశారు.

తనకు వారెప్పుడూ అమ్మాయిలేనని అన్నారు. ఈ సమాజం వారిని ఏం చేస్తుందోనని భయపడ్డానే తప్ప.. వారు ఆడపిల్లలుగా మారతారంటే ఎప్పుడూ అడ్డు చెప్పలేదన్నారు.