Violent Street Fight: ముద్దుపెట్టి నాలుకను కొరికేసిన అమ్మడు, పడిన నాలుకను ఎత్తుకెళ్లిన సిగుల్ పక్షి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, బ్రిటన్‌లో ఆశ్చర్యకర ఘటన
బ్రిటన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఓ మహిళకు పురుషుడికి జరిగిన గొడవలో (Violent Street Fight) పురుషుడు మూగవాడయ్యాడు. ఇది అకస్మాత్తుగా పెట్టిన ముద్దు మూలంగా అంటే నమ్ముతారా... మరి ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది ఆ అమ్ముడు.
బ్రిటన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఓ మహిళకు పురుషుడికి జరిగిన గొడవలో (Violent Street Fight) పురుషుడు మూగవాడయ్యాడు. ఇది అకస్మాత్తుగా పెట్టిన ముద్దు మూలంగా అంటే నమ్ముతారా...ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది ఆ అమ్ముడు. ఘటన వివరాల్లోకెళితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్ (Bethany Ryan) అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు ( James McKenzie) అనే వ్యకికి మధ్య వీధిలో చిన్న తగువు వచ్చింది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు.
ఈ నేపథ్యంలో మెకెంజీ కొట్టేందుకు ఆమె పైకి వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అదే క్రమంలో మెకెంజీ నాలుక చివరి భాగాన్ని కొరికింది. రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అది పట్టించుకోకుండా ఇద్దరూ గొడవపడుతూనే ఉన్నారు. ఆ తెగిన నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి కంట పడింది. దీంతో నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని ఎగిరిపోయింది. అది గమనించిన స్థానికిలు మేకంజీని ఆస్పత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు అతడికి సర్జరీ చేయాలని చూచించారు.
అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో మెకెంజీ మూగవాడయ్యాడు. దీంతో ర్యాన్‌పై అతడు స్థానికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్‌బర్గ్ ఫరీఫ్ కోర్టు ర్యాస్‌ను దోషిగా నిర్థారించి ఆమెకు జరిమాన విధించింది.
(The above story first appeared on LatestLY on Feb 23, 2021 03:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

