లాస్ వెగాస్‌లో ఇద్దరు మహిళలు నగదు, గడియారాన్ని దొంగిలించారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. వారు ఈ వస్తువులను తమ జననాంగాలలో దాచుకుని అరెస్ట్ అవడం మరింత ఆశ్చర్యకరం. జనవరి 9వ తేదీన లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు నిక్కీ గ్రాండెల్, స్టేసీ జాన్సన్‌లను అరెస్టు చేశారు. కాగా జనవరి 2న వారు ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. సీజర్స్ ప్యాలెస్‌లోని క్యాసినో ఫ్లోర్‌లో తాము కలిసిన వ్యక్తిని మహిళలు లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు బాగా పరిచయస్తులు కావడంతో ఓ గదిలోకి వెళ్లారు.
అనంతరం అతను స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్తూ ఒక రబ్బరు బ్యాండ్‌లో $6,500 నగదును, డఫిల్ బ్యాగ్‌లో రోలెక్స్ వాచ్‌ను చుట్టాడు. స్నానం చేసిన వచ్చిన కొద్దిసేపటికే బాధితుడు తన విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి ఇద్దరినీ తనిఖీ చేయగా మొదట ఏమీ బయటపడలేదు. ఆ తర్వాత ఎక్స్-రే శోధనలో యోనీలో ఆ వస్తువులు ఉన్నట్లు గ్రహించారు. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.