Ukraine Russia War: వైరల్ వీడియో.. రష్యా యుద్ధ ట్యాంకును ట్రాక్టర్‌కు కట్టి లాక్కెళ్లిన ఉక్రెయిన్ రైతు, దాని వెంట పరుగులు పెట్టిన రష్యా సైనికుడు

రష్యా భారీ ఆయుధ సంప‌త్తితో త‌మ దేశంపైకి దండెత్తి వ‌స్తుంటే..ఉక్రెయిన్ సైనికులు ప్రాణాల‌కు తెగించి మ‌రీ ర‌ష్యాను అడ్డుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ర‌ష్యా యుద్ధ ట్యాంక్‌ను సింగిల్‌గానే ఓ ఉక్రెయినియ‌న్ అడ్డుకోగా..తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు.. ఏకంగా ర‌ష్యా యుద్ధ ట్యాంకును త‌న ట్రాక్ట‌ర్‌కు క‌ట్టేసుకుని ఎంచ‌క్కా ఎత్తుకెళ్లిపోయాడు.

Ukraine Russia War: వైరల్ వీడియో.. రష్యా యుద్ధ ట్యాంకును ట్రాక్టర్‌కు కట్టి లాక్కెళ్లిన ఉక్రెయిన్ రైతు, దాని వెంట పరుగులు పెట్టిన రష్యా సైనికుడు
Ukrainian farmer tows Russian tank amid military invasion, see light-hearted video here

రష్యా భారీ ఆయుధ సంప‌త్తితో త‌మ దేశంపైకి దండెత్తి వ‌స్తుంటే..ఉక్రెయిన్ సైనికులు ప్రాణాల‌కు తెగించి మ‌రీ ర‌ష్యాను అడ్డుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ర‌ష్యా యుద్ధ ట్యాంక్‌ను సింగిల్‌గానే ఓ ఉక్రెయినియ‌న్ అడ్డుకోగా..తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు.. ఏకంగా ర‌ష్యా యుద్ధ ట్యాంకును త‌న ట్రాక్ట‌ర్‌కు క‌ట్టేసుకుని ఎంచ‌క్కా ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రిట‌న్ ఎంపీ జానీ మెర్స‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

ఈ వీడియోకు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌ను పూర్తిగా త‌మ స్వాధీనంలోకి తీసుకునే దిశ‌గా క‌దులుతున్న ర‌ష్యా..పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకుల‌ను, భారీ సంఖ్య‌లో సైనికుల‌ను ఉక్రెయిన్‌కు త‌ర‌లిస్తోంది. ఇందులో భాగంగా ర‌ష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకును ఆ దేశ సైనికులు అలా ప‌క్క‌న ఆపేసి సేద తీరుతున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఉక్రెయిన్ రైతు.. ర‌ష్యా సైనికుల కంట బ‌డ‌కుండా... ట్రాక్ట‌ర్‌తో అక్క‌డికి చేరుకుని యుద్ధ ట్యాంకును త‌న ట్రాక్ట‌ర్‌కు త‌గిలించుకుని వెళ్లాడు. అయితే ఆ రైతు అలా ఆ ట్యాంకును కొద్ది దూరం తీసుకెళ్ల‌గానే గ‌మ‌నించిన ర‌ష్యా సైనికుడు ఒక‌రు దాని వెంట ప‌రుగులు తీశాడు.

ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గానీ.. ర‌ష్యా యుద్ధ ట్యాంకును త‌న ట్రాక్ట‌ర్‌తో లాక్కెళుతున్న రైతు వెంట ర‌ష్యా సైనికుడు భ‌యంతో ప‌రుగులు తీయ‌డం ఆ వీడియోలో చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

(The above story first appeared on LatestLY on Mar 01, 2022 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).