Mumbai, Oct 1: బాలీవుడ్‌ నటుడు గోవిందా (Govinda) ఇంట్లో గన్‌ మిస్‌ ఫైర్‌ (gun misfire) అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబై (Mumbai)లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు గోవిందా. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్‌ గన్‌ ను తనిఖీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా మిస్‌ ఫైర్‌ అయ్యింది. అందులోని బుల్లెట్‌ గోవిందా కాలులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నటుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)