Commercial LPG (File: Google)

Newdelhi, Oct 1: దసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు (LPG Prices Hike) ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్‌ లో కూడా గ్యాస్ ధర (LPG Price) పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి మంగళవారం అర్థరాత్రి  నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1741కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి.

ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

వాటి ధరల్లో మార్పు లేదు

అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి. కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి.

కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా