Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో బీజేపీ నేతలకు ఊరట దక్కింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇస్తూ.. కేసు విచారణను (Electoral Bond Case) నిలిపివేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
Nirmala Sitharaman (photo-ANI)

ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో బీజేపీ నేతలకు ఊరట దక్కింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇస్తూ.. కేసు విచారణను (Electoral Bond Case) నిలిపివేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల బాండ్ల కొనుగోలు చేసేందుకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, పలువురు బీజేపీ అగ్రనేతలతోపాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరులోని తిలక్ నగర్‌ పోలీస్‌‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిలక్ నగర్ పీఎస్‌లో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలను బెదిరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ అగ్రనేతలు, పలువురు ఈడీ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి.జ్జానధికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ఈడీ ఉన్నతాధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కటిల్, విజయేంద్రలను ఫిర్యాదులో ప్రస్తావించారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించేందుకు ఆ స్టేషన్‌ పరిధిలోని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దాంతో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

దాంతో ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఆ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌తోపాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ నిలిపి వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ కీలక నేతలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దాంతో సోమవారం హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

(The above story first appeared on LatestLY on Sep 30, 2024 08:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).