Hari Hara Veera Mallu First Song: ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సాంగ్ 'మాట వినాలి' వచ్చేసింది.. పవన్ పాడిన పాటను విన్నారా? (వీడియో)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hyderabad, Jan 17: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది. తాజాగా హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది. ‘వీరమల్లు’ మాట చెబితే వినాలంటూ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ వాయిస్ లో ఈ పాట విన్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 17, 2025 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

