Mumbai, AUG 21: బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor), ఆనంద్‌ అహుజాలు (Anand Ahuja) 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్  (baby bump)ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి (Baby Boy For Sonam Kapoor) జన్మనిచ్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో.. ”ఆగస్టు 20, 2022.. మా బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్స్, నర్సులు, కుటుంబసభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రారంభం మాత్రమే, మా బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు. ఇట్లు మీ సోనమ్‌-ఆనంద్‌” అని పోస్ట్ చేసింది సోనమ్ కపూర్. దీంతో నెటిజన్లు, అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)