అక్కినేని తొక్కినేని’అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేన్నారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు ఈ వాక్యాలే వివాహస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Here's Naga chaitanya Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)