నవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Tollywood senior actor Kaikala Satyanarayana) (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని (Filmnagar) తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ప్రముఖ నటుడి కైకాల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నటుడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అభిమానులు సందర్శనార్థం నటుడి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
Here's CMO Tweet
సినీ నటుడు మాజీ ఎంపీ శ్రీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ @SomeshKumarIAS ను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) December 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)