Tollywood Celebrities Meet CM Jagan: ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి బృందం, తాడేపల్లిలో ఘన స్వాగతం..

ప్రత్యేక విమానంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ విజయవాడకు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

(Image: Twitter)

విజయవాడ, ఫిబ్రవరి 10 : సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకు టాలీవుడ్ పెద్దలు విజయవాడ చేరుకున్నారు. ఇప్పటికే టికెట్ రేట్లపై పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది కమిటీ. పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సినీపెద్దలు సీఎం జగన్‌ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ ధరలు, పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ విజయవాడకు చేరుకున్నారు  అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. చిరంజీవితో పాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి జగన్ తో భేటీ అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement