Suriya Emotional Video: వీడియో ఇదిగో, విజయకాంత్ సమాధి వద్ద భోరున ఏడ్చేసిన ప్రముఖ నటుడు సూర్య, నా అన్న ఇక లేరంటూ..
కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన సంగతి విదితమే. అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన సంగతి విదితమే. అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం నటుడు సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో కనిపించారు. సూర్య కెరీర్ తొలి చిత్రం పెరియన్న విజయకాంత్‌తోనే మొదలైన సంగతి విదితమే.ఈ సినిమా సూర్య కెరీయర్‌లో 4వ చిత్రంగా వచ్చింది.
ప్రముఖ నటుడు కెప్టెన్ విజయకాంత్ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు
విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య మాట్లాడుతూ..అన్నతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను..నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని తెలిపారు.
Here's Suriya Emotional Video
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2024 05:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

