Inter Exams Fee Date Extended: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.
Hyderabad, Dec 30: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు (Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు (Inter Exam Fee) గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంటర్ కోర్సుల్లో మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా.. ఇప్పటిదాకా 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని బోర్డు తెలిపింది.
ఇంటర్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే.. ఫీజు విషయంలో విద్యార్థులకు మరో అవకాశం#Inter #Exams
— News18 Telugu (@News18Telugu) December 30, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2023 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

