Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
Srisailam, Dec 30: శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు (Srisailam Mallanna) ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారని, భక్తులు గమనించాల్సిందిగా కోరారు.
Srisailam | శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దుhttps://t.co/bssExEb3oM
— Namasthe Telangana (@ntdailyonline) December 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2023 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

