శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురయ్యారు గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) అనే ఉద్యోగి. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రాణం కాపాడే దిశగా తీవ్రంగా కష్టపడుతున్నారు డాక్టర్లు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అతను కరెంట్ వైర్ల మధ్య చిక్కుకోవడం చూడవచ్చు. అలాగే ఇతర ఉద్యోగులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించడం కూడా వీడియోలో గమనించవచ్చు.

ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం, సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)