TSRTC Bumper Offer: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా.. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ (Discount) కల్పించాలని నిర్ణయించింది.
Hyderabad, July 2: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ (Discount) కల్పించాలని నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ రాయితీ సేవలు జులై 2, ఆదివారం నుండి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇది పరిమిత రాయితీ. ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. రానుపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% రాయితీ ఉంటుందని, ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
The 10 per cent discount offer will come into effect from July 2 on all the bus services with advance reservation facility.https://t.co/kWK2ynIUPb
— Telangana Today (@TelanganaToday) July 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 02, 2023 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

