దేశ రాజధాని ఢిల్లీలో జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్ 15లో ఉన్న జిమ్‌ప్లెక్స్ ఫిట్‌నెస్ జోన్‌లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్‌కు వెళ్లాడు.
ఉదయం 7.30 సమయంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Here's Video
Delhi: A man dies of electrocution in the gym. The FSL team reaches the now sealed gym as a probe into the incident begins.
We demand justice for our child: the bereaved kin of the youth speaks to @arsrabhishek - WATCH@kritsween shares more details. pic.twitter.com/oJ2FTnOKgs
— TIMES NOW (@TimesNow) July 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)