ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీని నిన్న ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆప్‌ నేతను కోర్టులో ప్రవేశ పెట్టారు.మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రపై 28 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌ను ఈడీ కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను పది రోజులు కస్టడీకి కోరింది.  అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పి ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అవ్వడం బాధగా ఉందని వెల్లడి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)