లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్‌ ఇచ్చారని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారని అన్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్‌ ఆధారాలు లేవు. ఈ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు కుట్రలు చేశారు. మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆప్‌ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోంది. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆప్, 4.5 కేజీల బరువు తగ్గారని వెల్లడి

బీజేపీతో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. అలాగే, కేజ్రీవాల్‌ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్‌ ఇచ్చారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్‌ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోదీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో ఆర్నెల్ల పాటు తీహార్‌ జైల్లో ఉన్న సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేయడం విడుదల అయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)