New Delhi, April 3: ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. తీహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్ ’వేదికగా ఆమె తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఢిల్లీ సీఎం రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుందని, ఆయన షుగర్ లేవల్స్ 50కి చేరుకున్నాయని ఆప్ నేతలు అన్నారు. మరోవైపు తీహార్ జైలులో ఉన్న అధికారులు, అతను బాగానే ఉన్నారని, జైలు వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.ఈ అంశంపై ఆప్ మంత్రి అతిషి కూడా సోషల్ మీడియా(social media) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు
అరవింద్ కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్థుడని, నేడు బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ 24 గంటలూ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అరెస్ట్ అయినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరువు 4.5 కిలోలు తగ్గడం చాలా ఆందోళనకరమని వెల్లడించారు.కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్ కేజీవాల్‌ను సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలు పంపిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15ను వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
14X8 ఫీట్ల వెడల్పు ఉన్న సెల్‌లో ఆయన్ను బంధించారు. కేజ్రీ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా మారుతున్నట్లు జైలు డాక్టర్లు చెబుతున్నారు. ఓ దశలో 50 కన్నా తక్కువ షుగర్ నమోదు అయినట్లు రిపోర్టులో ఉన్నది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు మెడిసిన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. లంచ్, డిన్నర్ కోసం ఆయనకు ఇంటి భోజనం పెడుతున్నారు. ఆయన కండీషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం ఆయన సెల్ వద్ద క్విక్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు తిహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహార్ లోని జైల్ నంబర్-2లో కేజ్రీవాల్ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్‌లో చంపేశారు. దిల్లీలోని వసంత్ విహార్ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు.
సహ ఖైదీలు అతడిని బ్యాట్లతో తీవ్రంగా కొట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన తనిఖీల్లో 33 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి.ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తిహాడ్ జైల్లోని ఖలిస్థానీలు దాడి చేస్తారని వాటిల్లో హెచ్చరించాడు. ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.