Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
Police arrested BJP MPs Etela Rajender and DK Aruna...

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్, లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్టిన పోస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు, అరెస్టుపై మండిపడిన హరీష్ రావు

ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు.

Police arrested BJP MPs Etela Rajender and DK Aruna 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 18, 2024 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).