బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం(నవంబర్ 18) అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్(ట్విటర్)లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. కాగా కొణతం దిలిప్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్‌కు తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.
BRS social media in-charge Kontham Dileep arrested
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలి.
ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గం.
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటు.
తెలంగాణ ఉద్యమకారుడు @KonathamDileep అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం.…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 18, 2024
Former Telangana Digital Media director and social media activist, Dileep Konatham, has reportedly been arrested by the Hyderabad Cybercrime police on Monday.
While the exact reasons for the arrest were yet to be ascertained, he is suspected to have been arrested for his recent… pic.twitter.com/ljQ8nQKKC4
— Srinivas Reddy K (@KSriniReddy) November 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)