Ghazipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళా నుంచి ఇంటికి వెళుతున్న భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది మృతి..పలువురికి తీవ్ర గాయాలు

యూపీలోని ఘాజీపూర్‌ (Ghazipur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో (devotees) వెళ్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Ghazipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళా నుంచి ఇంటికి వెళుతున్న భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది మృతి..పలువురికి తీవ్ర గాయాలు
Several Feared Dead As Truck Rams Into Kumbh Devotees' Vehicle In UP's Ghazipur

యూపీలోని ఘాజీపూర్‌ (Ghazipur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో (devotees) వెళ్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. గోరఖ్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగి ఇంటికి పయనమయ్యారు.

ఆగ్రాలో షాకింగ్‌.. హిట్ అండ్ రన్ కేసు, టోల్ బూత్ ఉద్యోగిని కిలో మీటర్‌ దూరం కారు బ్యానెట్‌పై ఈడ్చు కెళ్లి పడేసిన వైనం, వైరల్ వీడియో

పికప్‌ వాహనంలో వారంతా సొంతూరికి బయల్దేరారు. వారణాసి – ఘాజీపూర్‌ రోడ్డులోని నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఉస్మి కలా మలుపు వద్దకు రాగానే వీరి వాహనాన్ని ఓ ట్రక్కు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో 20 మంది భక్తులు వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Several Feared Dead As Truck Rams Into Kumbh Devotees' Vehicle 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 06:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).