Nagpur Car Accident Video: మంగళవారం తెల్లవారుజామున నాగ్ పూర్ లో జరిగిన కారు ప్రమాదం వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీ కొట్టడం కనిపిస్తోంది. నాగ్ పూర్ లోని పంజారా గ్రామ సమీపంలో చోటుచేసుకుందీ ప్రమాదం. కారులోని యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని, రీల్స్ కోసం కారును అతివేగంగా, అడ్డదిడ్డంగా నడిపారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు.
బోల్తా పడిన చోటు నుంచి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకుపోయిందని చెప్పారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారిందన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందితో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్ గానే ఉందని వైద్యులు చెప్పారన్నారు. తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు
Here's Videos
#WATCH: Video Reveal Moments Before Fatal Car Crash In Nagpur.
Two people were killed after this speeding car hit a crash barrier in Maharashtra's Nagpur earlier this week.#ViralVideo #Viral #Accident #Maharashtra #Nagpur #NagpurNews pic.twitter.com/LXyOfsK2G0
— TIMES NOW (@TimesNow) July 11, 2024
Tragic Accident in Nagpur: 2 Dead, 3 Severely Injured After Speeding Car Crashes into Barrier
Reportedly, the driver was drunk. This accident took place on july 9.
Watch as @Nilesh_isme & @prathibhatweets share more details.#ViralVideo #Nagpur pic.twitter.com/jkmm9AzyGb
— TIMES NOW (@TimesNow) July 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)