Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్
Photo of YS Jagan in Pushpa-2 Flexi

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో అల్లు అర్జున్‌తో పాటు జగన్ ఫొటో కూడా దర్శనం ఇచ్చింది. మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

ఇక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

Photo of YS Jagan in Pushpa-2 Flexi

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 04, 2024 03:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).