కేంద్ర ప్రభుత్వం శనివారం నాటి కేబినెట్ భేటీలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట ప్రారంభమైన ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని కరోనా విస్తృతి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా పొడిగింపు కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఉచిత రేషన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది.
ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూర్చుతోంది. ఇదిలా ఉంటే.. యూపీ సీఎంగా వరుసగా రెండో పర్యాయం పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఉచిత రేషన్‌ను మూడు నెలలు పొడిగిస్తూ శనివారం నాటి తన తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఈ పథకాన్ని ఆరు నెలల పాటు పొడిగించడంతో యూపీ ప్రభుత్వంపై ఈ పథకం భారం పడదు.
Pradhan Mantri Garib Kalyan Anna Yojana extended for 6 months, till September 2022. pic.twitter.com/MQdbOCAQln
— ANI (@ANI) March 26, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)