MLA Makkan Singh Raj Thakur: వీడియో ఇదిగో, నన్నాపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మండిపడుతున్న నెటిజన్లు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిపిసిలో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు.

MLA Makkan Singh Raj Thakur: వీడియో ఇదిగో, నన్నాపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మండిపడుతున్న నెటిజన్లు
MLA Makkan Singh Raj Thakur Abusive Words on Traffic ACP (Photo-Video Grab)

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిపిసిలో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు. దీంతో ఆయన కోపంతో తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడు అంటూ ట్రాఫిక్ ఏసిపి అయిన జాన్ నర్సింహులు మీద ఆగ్రహించారు.

కేటీఆర్ ఓ బచ్చా... నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కే లేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పద్ధతిగా మాట్లాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేతో చెప్పే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం అంటూ ఆయనను నెట్టేస్తూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసి అతనిపైన చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి ఏసీపీకే గొడవ వద్దని సర్ది చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

MLA Makkan Singh Raj Thakur Abusive Words on Traffic ACP

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 06:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).