Peddapalli, Feb 6: మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల (Loksabha)  ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లో ఈసారి సిట్టింగ్ లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేశ్ నేత పార్టీ మారినట్లు తెలుస్తోంది.

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)