Bharat Rice (Credits: X)

Newdelhi, Feb 6: పెరిగిన బియ్యం (Rice Prices) ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది. 'భారత్‌ రైస్‌' (Bharat Rice) పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ఢిల్లీలో ఈ విక్రయాలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన పేర్కొంది.

Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం

ఎక్కడ దొరుకుతాయ్?

భారత్‌ రైస్‌ను ఈ-కామర్స్‌ వేదికలపైనతో పాటు ఎంపిక చేసిన అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో భారత్‌ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనుంది.

PM Modi Speech in Lok Sabha: ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే, 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ