PM Modi Speech in Lok Sabha: ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే, 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ
Prime Minister Narendra Modi (Photo Credits: X/@BJP4India)

New Delhi, Feb 5: లోక్‌సభ వేదికగా కాం‍గ్రెస్‌ను, రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని.. పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

వంద రోజుల్లో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడబోతుంది. అబ్‌కీ బార్‌ మోదీకి సర్కార్‌. బీజేపీకి సొంతంగా 370కిపైగా సీట్లు వస్తాయి. ఎన్డీయేకు ( BJP-Led NDA Government) వందకు పైగా సీట్లు వస్తాయి.. మూడో టర్మ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం. సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే సమయం ఆసన్నమైంది, లోక్ సభ వేదికగా ప్రధాని మోదీ ధ్వజం, వీడియో ఇదిగో..

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (India Will Be 3rd Largest Economy) అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు నొక్కి చెప్పారు. 2014-15 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం పాత చింతకాయ పచ్చడి పార్టీ అని అన్నారు. బీజేపీ పై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయి. కొంత మంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారు. ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. మీ ఆలోచనా తీరును దేశం గమనిస్తోంది. విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు.

Here's Video

తన మూడవ టర్మ్‌లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఉద్ఘాటిస్తూ, PM మోడీ అప్పటి ఆర్థిక మంత్రిని ఉటంకిస్తూ, "2014లో భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నేడు, భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, అయినప్పటికీ వారు (కాంగ్రెస్) మౌనంగా... 30 ఏళ్లలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా అవతరించనుందన్న దార్శనికతను చూశారు.. దేశాన్ని ఇంత కాలం వేచి ఉండనివ్వం.. మన మూడో టర్మ్‌లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని మోదీ హామీ ఇస్తున్నారని తెలిపారు.

జార్ఖండ్‌లో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, 47 ఓట్లతో బల పరీక్షలో నెగ్గిన చంపయ్ సొరెన్ సర్కారు, వ్యతిరేకంగా 29 ఓట్లు

10 సంవత్సరాల పాలనా అనుభవం ఆధారంగా, నేటి బలమైన ఆర్థిక వ్యవస్థ, నేడు భారతదేశం పురోగమిస్తున్న వేగవంతమైన వేగాన్ని పరిశీలిస్తే, మన మూడవ టర్మ్‌లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. ఇది మోడీ గ్యారెంటీ" అని ప్రధాని అన్నారు. 2014 నుంచి గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ప్రధాని మోదీ జాబితా చేశారు.

పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టాం.. పట్టణ పేదలకు 80 లక్షల పక్కా ఇళ్లు కట్టాం.. కాంగ్రెస్‌ హయాంలో వీటిని నిర్మించి ఉంటే.. ఈ పని చేయడానికి 100 ఏళ్లు పట్టేది.. ఐదు తరాలు గడిచి ఉండేవని మోదీ అన్నారు. బ్రిటీష్ కాలం నాటి శిక్షాస్మృతి రద్దు, అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన దార్శనికతలను జాబితా చేస్తూ, ప్రధాన మంత్రి ఇలా అన్నారు, “రాముడు స్వదేశానికి మాత్రమే కాకుండా, అటువంటి గొప్ప ఆలయానికి తిరిగి వచ్చాడు, అది ఖచ్చితంగా ‘అబ్కీ బార్ 400 పార్’ (ఈసారి 400 ఖర్గే జీ (మల్లికార్జున్ ఖర్గే) కూడా అంటున్నారు. NDA 400+ సీట్లు గెలవడమే కాదు, BJP 300 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో దాదాపు అరవై మంది ఎంపీలు పాల్గొన్నారు. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఇచ్చిన సమాధానంలో మోదీ ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. "వారి ప్రసంగంలోని ప్రతి పదం నుండి నేను అధికారంలో, వారు ఎక్కువ కాలం ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లుగా దేశం ఇప్పుడు విశ్వసిస్తోందని ఎద్దేవా చేశారు.

దేశాన్ని విభజించడమే విపక్షాల పని. ఇలా ఎంతకాలం ఇలా చేస్తారు?. ఎన్నాళ్లీ మైనారిటీ రాజకీయాలు? అంటూ అధీర్ రంజన్ చౌదరిను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రశ్నించారు. మేం అభివృద్ధి నినాదం చేస్తే.. కాంగ్రెస్‌ క్యాన్సిల్‌ నినాదం తలెత్తుంది. మేం ఎలాంటి అభివృద్ధి చేసినా క్యాన్సిల్‌ అంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ విద్వేషం మీ గుండెల్లో ఉంచుకుంటారు. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మానడం లేదు. ఒక కుటుంబం కోసం పార్టీ పని చేస్తే దానిని కుటంబ పాలనగానే మేం భావిస్తాం. కాంగ్రెస్‌ది కుటుంబ రాజకీయం. ఒకే కటుంబం చుట్టూ తిరుగుతుంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం. కుటుంబ పాలన వల్ల దేశం ఎంత నష్టపోయిందో.. కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే నష్టపోయారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్‌ పదే పదే రీలాంచ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ దుకాణం ఒక్క నాయకుడి కోసమే. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయి. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోంది. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరు. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోంది.

తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారడం లేదు. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకు విపక్షాలకు నా ధన్యవాదాలు. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. కూటమి(ఇండియా) కుదుపులకు లోనైంది. విపక్షాల సంకల్పానికి నేను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ చురకలంటించారు.