Newdelhi, Sep 19: అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌ గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ (Gazette) విడుదల చేసింది. ఇప్పటికే పాత పార్లమెంటు భవనానికి (Parliament building) సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో సభా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి.

GSB Seva Mandal: ముంబైలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్.. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం.. రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)