తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ దాడులు చేసుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా కొట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు పార్టీలో పదవులు ఇవ్వడంపై మరో వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో

వివాదం మరింత ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.ఈ గొడవపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఏకంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే తన్నుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై దాడి సమయంలోనూ యూత్ కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు వెలువెత్తాయి.

Youth Congress leaders Fighting Each one in Gandhi Bhavan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)