School Benches as Fuel: బీహార్‌ లో మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే వంట చెరకు.. దర్యాప్తునకు విద్యాశాఖ ఆదేశం

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌ లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్‌ గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌ లో ఈ ఘటన జరిగింది.

School Benches as Fuel: బీహార్‌ లో మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే వంట చెరకు.. దర్యాప్తునకు విద్యాశాఖ ఆదేశం
School Benches as Fuel (Credits: X)

Patna, Jan 14: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Mid-Day Meal) వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే (School Benches) వంట చెరకుగా (Fuel) మార్చేశారు. బీహార్‌ లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్‌ గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌ లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్‌ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్‌ చేశారని వంట మనిషి ఆరోపించారు. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. బెంచీలను వంటచెరకుగా వాడుకోమని చెప్పింది తాను కాదని, స్కూలు ప్రిన్సిపాల్‌ అని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ మాత్రం దీనిని ‘మానవ తప్పిదం’గా కొట్టిపడేశారు.

Fertility Problems: సంతానం కలుగట్లేదా? అయితే, మీరు కూర్చుంటున్న కారు సీటే దీనికి కారణం కావొచ్చు. ఇంగ్లండ్‌ శాస్త్రజ్ఞులు తాజాగా ఏం చెప్పారంటే??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 14, 2024 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).