Newdelhi, Jan 14: సంతాన లేమి సమస్యతో (Fertility Problems) భాధ పడుతున్న దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. అందుకే ప్రతి నగరంలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే తాజాగా ఇంగ్లండ్ శాస్త్రజ్ఞులు సంతాన లేమికి కారు సీటు కూడా కారణం కావచ్చని గుర్తించారు. మాంచెస్టర్ యూనివర్సిటీలోని అండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేషీ తెలిపిన వివరాల ప్రకారం సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాల (Sperm) ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల (Testicles) వద్ద చల్లగా ఉండాలి. కారులో లేదా బైకుపై ప్రయాణించేటప్పుడు పురుషులు కూర్చునే సీటు వేడిగా ఉండటం వల్ల వృషణాలలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నట్టు అలన్ పేషీ తెలిపారు.
Trying for a baby? Men should beware of the heated blankets and car seats this winter, fertility experts say - https://t.co/Htce9d715o pic.twitter.com/a3EAVR4yWi
— Vale50plus (@vale50plus) January 12, 2024
ఇలా చూసుకోవాలి
బిగుతైన ప్యాంటు ధరించడం లేదా కారు లేదా ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన తెలిపారు. వీర్యకణాల సంఖ్య పెరుగాలంటే ఇకపై కారు సీటు వేడిగా ఉందో, లేదో సరిచూసుకోవాలని హితవు పలికారు.