మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు దిగారు. దీంతో వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భ‌యంతో కారులో పారిపోవాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతోన్న గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు. వారి రాక‌ను ముందుగానే గుర్తించిన గ్రామస్థులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు. వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌గానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్ట‌డానికి దూసుకొచ్చారు. కొంద‌రు అధికారులు త‌ప్పించుకుని కారులో పారిపోగా, పంచాయతీ అధికారిణికి మాత్రం తీవ్రగాయాల‌య్యాయి. అనంత‌రం ఆ గ్రామంలోకి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితులు చేజారకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)