Hyderabad, June 14: హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో (Sticks) కొట్టి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిని సమీర్ (28)గా గుర్తించారు. సమీర్ స్థానికంగా డెకరేషన్ పనులు చేస్తాడని సమాచారం. ఓ విషయంలో వాగ్వివాదం జరుగడంతోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.
Here's Video
హైదరాబాద్ నడిబొడ్డున అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య
బాలాపూర్ పోలీస్ పరిధిలో రాయల్ కాలనీలో సమీర్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. @tgpolice @revanth_anumula @TelanganaCMO pic.twitter.com/KLboRSJmUj
— Subbu (@subhashvavanag1) June 14, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)