Govt. School in Siddipet (Credits: X)

Siddipet, June 14: విద్యార్థులు (Students) లేక ప్రభుత్వ స్కూల్స్ (Govt. Schools) మూతబడుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, సిద్ధిపేట (Siddipet) పట్టణంలోని ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌ లో రూటే సపరేటు. ఆ స్కూల్ లో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు గేటు ముంగట పడిగాపులు కాస్తారు. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మాకు ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ కార్పోరేట్ స్కూళ్లలో అడ్మిషన్ కోసం బతిమిలాడే ఘటనలు ఈ స్కూల్ ముందు కనబడతాయి. ఇది కేవలం ఈ యేడాదే కాదు. గత తొమ్మిదేళ్ల  నుంచి ఇదే తంతు జరుగుతున్నది. ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌  పాఠశాలలో విద్య, విజ్ఞానం, పోటీతత్వంలో.. కార్పోరేట్‌కు ధీటుగా ఉండడంతో.. విద్యార్థులు క్యూ కడుతున్నారు. దీంతో ‘నో అడ్మిషన్లు’ అనే బోర్డును ఏటా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఉన్నవి 160 సీట్లు మాత్రమే. కానీ, వందల మంది పేరెంట్స్‌ నుంచి అడ్మిషన్ అప్లికేషన్లు వస్తుండటంతో ఇలా ఈ బోర్డును పెడుతున్నారు.

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ అంచనా

9 ఏండ్లుగా  ఇదే తంతు..

9 ఏండ్ల క్రితం 300 మంది విద్యార్థులున్న ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో క్రమక్రమంగా సీట్లు పెంచుతున్నా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023-24 విద్యా సంవత్సరానికి 1195 విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఆ పాఠశాలకు ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయాయి. ఇప్పటికే 7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లో ఒకటి అరా మినహా అన్ని అడ్మిషన్లు నిండిపోగా,ఆరో తరగతిలో దరఖాస్తుల కోసం రోజూ వందల మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.

ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్

అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ టెస్టు

హైస్కూల్ లో ఈ ఏడాది 6-10 తరగతుల్లో 250 సీట్లు ఉంటే ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును పెట్టింది. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనుంది. గత ఏడాది ఇక్కడ 231 మంది టెన్త్ పరీక్ష రాస్తే ఒక్కరే ఫెయిల్ అయ్యారు.