Rains (Credits: Pixabay)

Hyderabad, June 14: తెలంగాణలో (Telangana) మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం (Bay of Bengal) మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేరొన్నారు.

జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్‌ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కేబినెట్ మంత్రి హోదాను కల్పించనున్న మోదీ సర్కారు

నేడు, రేపు వర్షాలు పడే ప్రాంతాలు

పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేరొన్నది.

ప్రధాని నరేంద్ర మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని.. ఇంటర్నెట్ లో వైరల్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..

గురువారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా కంపాసాగర్‌ లో అత్యధికంగా 7 సెం.మీ, నిడ్మనూర్‌ లో 5, మిర్యాలగూడలో 3, జోగులాంబ-గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 6, నిజామాబాద్‌ జిల్లా నవీపేట, రంజల్‌, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 3 చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.

దివ్యాంగుడుని ఎక్కించుకోలేదని ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన, బస్సు డ్రైవర్ ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడని మండిపాటు