Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో

మహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు.

Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో
ISRO Releases Space View Images of Maha Kumbh Mela(X)

మహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో మహా కుంభమేళ ముగియనుంది.

ప్రపంచం నలుమూలల నుంచి త్రివేణి సంగమంకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుండగా ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఇస్రో (ISRO).

స్పేస్‌ సెంటర్‌ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ మేళా ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించగా డిసెంబర్‌ 22 నాటికి నిర్మాణాలు వెలిశాయి. ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ మేళ ప్రాంతం దర్శనమివ్వగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గామ మారాయి.   ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక

ISRO Releases Space View Images of Maha Kumbh Mela

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 22, 2025 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).