Mahakumbh Mela (Photo-ANI)

Prayagraj, Jan 21: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు రికార్డు స్థాయిలో వస్తున్నారు. గంగ యమునా సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది లో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించారు. రెండో రోజైన మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన 2 కోట్ల మంది భక్తులు, అమృత స్నానాన్ని ఆచరించిన అఖాడా వర్గానికి చెందిన సాధువులు

మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు.అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

8.6 Crore Devotees Take Holy Dip In Triveni Sangam

సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది.